Friday, 31 July 2026 12:54:59 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఖాతాదారుని కుటుంబానికి అండగా నిలిచి కోటి రూపాయలు అందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Date : 25 March 2026 09:39 PM Views : 264

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 25 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సంజీవ్ నగర్ గ్రామానికి చెందిన పాణ్యం. విజయ్ అనే వ్యక్తి ఆత్మకూరు విద్యుత్ శాఖ లో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆత్మకూరు బ్రాంచ్ నందు శాలరీ ఖాతా కలిగి ఉన్నాడు.. ప్రభుత్వం నుండి వచ్చే జీతాన్ని బ్యాంకులో పడేవిధంగా ఖాతా రూపొందించారు. ఇదే క్రమంలో గత మూడు నెలల క్రితం విజయ్ ఉద్యోగ విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ స్తంభంపై కరెంట్ షాక్ కు గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ క్రమంలో బ్యాంకు నందు శాలరీ ఖాతా ద్వారా ఇతనికి ₹కోటి రూపాయలు మంజూరు కాగా నేడు ఆత్మకూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో SBI నెల్లూరు రీజినల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ ఆధ్వర్యంలో మరణించిన విజయ్ భార్య అరుణకు వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయల చెక్కును అందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ఖాతాదారులకు ఎస్బిఐ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని రీజనల్ మేనేజర్ మరియు ఇతర సిబ్బంది తెలిపారు.. ఈ కార్యక్రమంలో SBI నెల్లూరు రీజినల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ తో పాటు SBI చీఫ్ మేనేజర్ సీతారామశర్మ, ఆత్మకూరు SBI బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ మున్వర్, అసిస్టెంట్ మేనేజర్ షేక్ షరీఫ్ ఇతర సిబ్బంది హాజరయ్యారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: