Thursday, 30 July 2026 10:32:35 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఇది కుట్రలు చేసే ప్రభుత్వం - వైసీపీ ఇంచార్జ్ నిసార్ అహమ్మద్

ఓట్ల తొలగిపుతో ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం -- SIR పై నిర్లక్ష్యం వహించవద్దు

Date : 30 May 2026 07:29 PM Views : 74

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఇది కుట్రలు చేసే ప్రభుత్వం... ఓట్ల తొలగిపుతో ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం -- SIR పై నిర్లక్ష్యం వహించవద్దు -- ఓటర్ల జాబితా పునఃపరిశీలనపై అప్రమత్తంగా ఉండండి -- మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ స్పష్టం -- YSRCP రాయలసీమ రీజనల్ కో ఆర్డీనేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ఆద్వర్యంలో BLA లకు అవగాహన కార్యక్రమం ఇది కుట్రలు చేసే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డిపాజిట్లు కూడా గల్లంతు అయ్యే ప్రమాదం పొంచి వుంది అంటూ YSRCP బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) అవగాహన కార్యాలయంలో నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. ‌మదనపల్లె మిషన్ కాంపౌండ్‌ లోని CSI JCM కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబితా పునఃపరిశీలన ప్రక్రియపై పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో మదనపల్లె నియోజకవర్గం సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆధ్వర్యంలో (BLA) బూత్ లెవెల్ ఏజెంట్ల లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రీజనల్ కో ఆర్డినేటర్ మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై వారు BLA లకు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా పునపరిశీలన ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఓట్ల తొలగింపు కారణంగా ఎన్నికల ఫలితాలే తారుమారు అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక గ్రామాల్లో ఏ ఒక్క ఓటరూ మిస్ కాకుండా చూడాలని BLA లకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కు అని, ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం బూత్ లెవెల్ ఏజెంట్ల బాధ్యత అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో YSRCP అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, ఒక్క అర్హుడైన ఓటరు కూడా అన్యాయంగా జాబితా నుంచి తొలగింపుకు గురికాకుండా పార్టీ తరఫున నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఇది కుట్రలు చేసే ప్రభుత్వం, మనం అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ‌ఇటీవల జరిగిన ఎన్నికలలో హేమాహేమీలకు ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరూ చూశారు, మనం ఏమారితే మనకు అలాంటి పరిస్థితి రావచ్చు అంటూ చక్కగా వివరించారు. ‌స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలోనే రానున్నాయని, ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు ఎన్.అనీషారెడ్డి, జింకా చలపతి, ఉదయకుమార్, బాబ‌్‌జాన్ మాజీ మునిసిపల్ చైర్మన్ మనుజా రెడ్డి , సీనియర్ నాయకులు శ్రీనాథ రెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్ రెడ్డి, ఎల్. రఘునాథ రెడ్డి, మునిశేఖర్, ఎస్.కె ఇర్ఫాన్, సిహెచ్ రామచంద్రా రెడ్డి, మండల కన్వీనర్లు కేశవరెడ్డి, కరుణాకర్ రెడ్డి, కె. శ్రీనివాసులు రెడ్డి, మస్తాన్ ఖాన్, నరసింహా రెడ్డి, ఎన్ ఇర్ఫాన్ ఖాన్, బిఏ‌.ఖాజా , శ్రీనివాసులు, ప్రసాద్ బాబు, శీలం రమేశ్, గ్రానైట్ మహేశ్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, ఎన్ నవాజ్, రామమోహన్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, తిమ్మయ్య, శ్రీకాంత్ రెడ్డి, చరణ్, మధు, సమద్, యూనస్, మజ్జిగ కేశవ యాదవ్, జబి, యసీన్, ఫక్రుద్దీన్, బీరంగి రేవతి, అబ్దుల్లా, నాగమణి, అమ్మాజన్, శ్యామల, అపర్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: