నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 25 : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 'నా భారత్ నా ఓటు' అనే నినాదంతో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని బీటీ కళాశాల బీసెంట్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముందు కలెక్టర్ కార్యాలయం నుంచి బీటీ కళాశాల వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ..యువత ఓటర్లుగా నమోదు కావడమే కాకుండా ప్రజాస్వామ్య బలోపేతానికి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.కొత్తగా ఓటర్లుగా నమోదు అయిన యువతకు గుర్తింపు కార్డులు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక హక్కు మాత్రమే కాక బాధ్యత కూడా అని అధికారులు తెలిపారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ ఎక్కువసార్లు ఓటు వేసిన సీనియర్ సిటిజన్లను దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. యువ ఓటర్లకు ఓటర్ కార్డులు పంపిణీ చేశారు.అలాగే వివిధ ప్రైవేట్ కళాశాలల్లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, వంటి పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన్ రావు, జిఎస్డబ్ల్యుఓ లక్ష్మీపతి లతో కలిసి పురపాలక సంఘం అధికారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు
Admin
Namitha News