నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జూన్ 04: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని రామసముద్రం పోలీస్ స్టేషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సందర్శించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించిన ఆయన, స్థానిక శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శ్రీ రవినాయక్, రామసముద్రం ఎస్ఐ శ్రీ రిషికేశవ రెడ్డిలతో ప్రత్యేకంగా మాట్లాడి, ఈ ప్రాంతంలో నేరాల తీరుపై ఆరా తీశారు. విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, ప్రజలకు మరింత చేరువవ్వాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఎస్పీ గారు సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడంతో పాటు, నిరంతరం క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు
Reporter
Namitha News