Thursday, 30 July 2026 06:12:37 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

జనగణనకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉండాలి

ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 29 January 2026 07:51 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 29 : ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలని, జన గణనకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్... జనగణన, ఎన్ఎస్ఎంఈ పార్కులు, ద్వారా అందించే సేవలు, అక్షర ఆంధ్ర, దేవాలయాలలో అందించే సేవలు, రెవెన్యూ సేవలు, ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు, అగ్నిమాపక శాఖ అందించే ఎన్ఓసీలు, రవాణా శాఖలో అందించే సేవలు తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మదనపల్లె కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.... జనగణన పై జిల్లా కలెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని జి ఎస్ డబ్ల్యూ ఎస్ సిబ్బంది జనగణ లో పాల్గొంటారని తెలిపారు. ప్రజలు తమ వివరాలను జనగణన వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ అందించే సేవలపై ప్రజల్లో అవగాహన పెంచి వాట్సాప్ ద్వారా సేవలు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు అక్షర ఆంధ్ర కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. దేవాలయాలలో అందించే సేవలు, రెవెన్యూ సేవలు, ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు, అగ్నిమాపక శాఖ అందించే ఎన్ఓసీలు, తదితర అంశాలలో ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలని సూచించారు. యూరియా అందుబాటులో ఎటువంటి ఇబ్బందులు తలెత్త రాదన్నారు. భూముల రీ సర్వే ఫ్రీ పథకం నీటి సరఫరా మరియు వీధి దీపాలు తదితరాంశాలలో ప్రజల నుండి స్వీకరించిన అభిప్రాయాలపై సమీక్షించుకొని, అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రజల సంతృప్తికర స్థాయిని పెంచాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులకు ఆయా శాఖల అంశాలకు సంబంధించి తగు సూచనలు జారీ చేశారు. జన గణన పై గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉండాలని వాట్సాప్ ద్వారా అందుకునే సేవలను పెంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సేవలందించాలని, తగినంత సిబ్బంది ఉండేలా చూసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ, డిఆర్ఓ మధుసూదనరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :