Thursday, 30 July 2026 04:18:31 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర

Date : 28 July 2026 07:07 PM Views : 32

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 28 : తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీల విద్యుత్ బకాయిలు చెల్లింపుకు సహకరించాలని ఎంపీడీవో ఉషారాణిని విద్యుత్ శాఖ ఎఈ సురేంద్ర కోరారు. మంగళవారం ఆయన ఎంపీడీవో తో సమావేశమై పంచాయతీలలో తాగునీటి సరఫరా విద్యుత్ మోటర్ల బిల్లులు, వీధిలైట్లు బిల్లులు పేరుకుపోయినట్లు సూచించారు. భవిష్యత్తులో ప్రీపెయిడ్ మీటర్లు బిగించి డైరెక్టుగా కార్యాలయం బిల్లులు చెల్లింపు సులువుగా ఉంటుందన్నారు. ఇకపై విద్యుత్ బిల్లులు లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా డిజిటల్ పేమెంట్ చేయడానికి సహకరించాలన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్తు కనెక్షన్ తో లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపు లేకుండా ఆదాయ వనరు గా మారుతుందని ఇందుకు మండల పరిషత్ అధికారులు సహకరించేలా కృషి చేయాలన్నారు. ఎంపీడీవో ఉషారాణి స్పందించి పంచాయతీల బిల్లు చెల్లింపుకు సహకరిస్తామని అదేవిధంగా సోలార్ విద్యుత్తు పై గ్రామాల్లో అవగాహనకు సచివాలయ సిబ్బందికి సూచనలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్లు శంకర, ఇంతియాజ్, సీనియర్ అసిస్టెంట్ శివ మూర్తి పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :