నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 16 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ, న్యూ ఢిల్లీ వారు 2025–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" (సార్వత్రిక మానవ విలువలు) కోసం నోడల్ సెంటర్‌గా గుర్తింపు లభించిందని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ తెలియజేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విలువల ఆధారిత విద్యా విధానం, సమాజ సేవా దృక్పథం పెంపొందించడం వంటి అంశాల్లో మిట్స్ చూపుతున్న నిరంతర కృషిని గుర్తించి గౌరవ గుర్తింపు ధ్రువపత్రంను అందజేశారు. సార్వత్రిక మానవ విలువలను విద్యా వ్యవస్థలో సమన్వయం చేయడం, ఇతర విద్యాసంస్థలకు కూడా ఈ విలువలను విస్తరించడం, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక బాధ్యతల పట్ల విద్యార్థులు, అధ్యాపకులను ప్రోత్సహించడం వంటి అంశాలు ఈ గుర్తింపుకు కారణమయ్యాయి. మిట్స్ యూనివర్సిటీ అందిస్తున్న విలువల ఆధారిత విద్య దేశ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా మానవ విలువలను పెంపొందించే విద్యను మరింత బలోపేతం చేస్తామని, విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో మిట్స్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్. యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ యూ.హెచ్.వి సెల్ మెంబెర్స్ మరియు అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్,యూనివర్సిటీ యూ.హెచ్.వి సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ బి జగదీశ్ బాబు మరియు కో-కోఆర్డినేటర్ డాక్టర్ కే చంద్ర మోహన్ లు పాల్గొన్నారు.
Reporter
Namitha News