Friday, 31 July 2026 08:52:10 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

అట్టహాసంగా అట్లుంటది మనతోని సినిమా షూటింగ్

వినోదాత్మక ప్రేమ కథాచిత్రమని దర్శకులు రామ్ సుంకర వెల్లడి - పోస్టర్స్ ఆవిష్కరించిన చిత్రబృందం

Date : 29 May 2026 05:32 PM Views : 93

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అట్టహాసంగా అట్లుంటది మనతోని సినిమా షూటింగ్ ప్రారంభం - వినోదాత్మక ప్రేమ కథాచిత్రమని దర్శకులు రామ్ సుంకర వెల్లడి - పోస్టర్స్ ఆవిష్కరించిన చిత్రబృందం మదనపల్లె : 'అట్లుంటది మన తోని' చలన చిత్రం శుక్రవారం మదనపల్లె పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయంలో లాంఛనంగా షూటింగ్ ప్రారంభమైంది.అనంతరం స్థానిక సొసైటీ కాలనీలోని కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సినిమా దర్శకులు,హీరో హీరోయిన్,నిర్మాతలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా చిత్ర దర్శకులు రామ్ సుంకర మాట్లాడుతూ ఈ చిత్రం వినోదాత్మక ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించడం జరుగుతుందని తెలిపారు.ఇందులో కథానాయకగా ముంబయికి చెందిన రిచా జోషి,కథా నాయకుడిగా వినయ్ నటిస్తున్నారని తెలిపారు.అంతే కాకుండా చలనచిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన నటులు ఈ చిత్రంలో నటించబోతున్నారని చెప్పారు.మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని,అలాగే ఇతర ప్రాంతాల్లో పాటలు తీయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి కుటుంబంలో అందరూ కలిసి చూడదగ్గ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు.ఈ చిత్రం హీరో,హీరోయిన్ వినయ్,రిచాజోషిలు మాట్లాడుతూ మొదటిసారిగా వెండితెర మీద హీరో హీరోయిన్లుగా రాబోతున్నట్లు తెలిపారు.ఇందుకు అవకాశం కల్పించిన చిత్ర నిర్మాతకు దర్శకులకి ధన్యవాదాలు తెలిపారు.ఈ చిత్రం ప్రేక్షకుల మనసును దోచుకుని మంచి చిత్రంగా గుర్తింపు పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.చిత్ర నిర్మాత రాటకొండ రవితేజ నాయుడు మాట్లాడుతూ చిత్ర నిర్మాణంలో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకొని ఎక్కడ రాజీపడకుండా,మంచి చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం జరుగుతుందన్నారు.ఈ చిత్రం ద్వారా మదనపల్లెకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :