Thursday, 30 July 2026 06:09:45 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

దేశాభివృద్ధి యువత స్ఫూర్తి తో ముందుకురావాలి - సినీ నటుడు ఆలీ

Date : 10 November 2025 06:51 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - నవంబర్ 10 : భారతదేశ అభివృద్ధి కి యువత స్ఫూర్తి తో ముందుకు రావాలని ప్రముఖ సినీ నటుడు ఆలీ అన్నారు. కడపలో జరిగిన అమీన్ పీర్ పెద్దదర్గా ఉత్సవాలకు హాజరైన సినీ నటుడు ఆలీని పీలేరు నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించాలని, భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు. సర్వ మతాల సమాహారంగా విరాజిల్లుతున్న మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని, ముఖ్యంగా సామరస్యాన్ని, సోదర భావాన్ని అలవర్చుకోవాలన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుందని, నాటి జాతీయ నాయకుల కలలు, ఆశయాలను సాఫల్యం చేసే దిశగా యువత నడుచుకోవాలన్నారు. దేశాభివృద్ధిలో యువత, విద్యార్థుల పాత్ర కీలకమైనదని, యువత తలుచుకుంటే ఏది అసాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు సర్పంచ్ హబీబ్ బాషా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్,కేంద్ర ఉక్కు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అలీ భాయ్, నాయకులు ఆబీద్, కాలేషా,జాకీర్, అమిన్ పీర్, సమీ, ఇమ్రాన్, యూసుఫ్, హరిప్రసాద్ రెడ్డి, రమణ, మణి పాల్గొన్నారు

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :