Saturday, 01 August 2026 12:30:37 AM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

భాగ్యనగర్ రియల్ సిటీ (వెంచర్) భూమిపై కబ్జాదారుల కన్ను

రూ.100 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్రలు - న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి బాధితులు వినతి

Date : 17 November 2025 06:17 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భాగ్యనగర్ రియల్ సిటీ (వెంచర్) భూమిపై కబ్జాదారుల కన్ను - రూ.100 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్రలు - న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి బాధితులు వినతి మదనపల్లె : వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తాము మదనపల్లి మండలం,పోతబోలు గ్రామ పంచాయితీ,సర్వే నెం : 153 నందు 3 ఎకరాల 54 సెంట్లుపైకి ఇంటి జాగాల కోసం వెయ్యబడిన కన్వర్షన్ కాని భాగ్యనగర్ రియల్ సిటీ (వెంచర్) లే ఔట్ నందు ప్లాట్లు కొనుగోలు చేసి ఆ ఫ్లాట్లపై కబ్జాదారుల కన్నుపడిందని,వారి నుండి మా ప్లాట్లను కాపాడాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి బాధితులు సోమవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సదరు భూమి ప్లాట్లుగా వేయబడిన జాగాను సుమారు 100 కోట్లు విలువ చేసే ప్లాట్లపై వై.యస్.ఆర్.సి.పి నాయకుల కన్ను పడిందని,వారి అనుచరులతో కలిసి లేఔట్ నందు వేయబడిన రాళ్లు,గుర్తులను తొలగించి మొత్తం చదును చేసి భౌగోళికంగా దానిని వ్యవసాయ భూమిగా ఫెన్సింగ్ వేయడం జరిగినదన్నారు.అంతేకాకుండా వ్యక్తిగతంగా రిజిష్టరు చేసుకున్నా ప్లాట్లలను వీరు కబ్జా చేసి సదరు భూమిని వీరి కబ్జాలో ఉంచుకున్నారన్నారు.ఆ సర్వే నెంబరు మొత్తం విస్తీర్ణం ఎకరా 3.54 సెంట్లు రోడ్లు పోను 192 ప్లాట్లుగా విభజించి దానిని భాగ్యనగర్ రియల్ సిటి (గ్రీన్ సిటిగా) రిజిష్టర్ నెం : 66గా నమోదు చేసి నెలసరి వాయిదాల పద్ధతిలో సదరు ప్లాట్లు కొనుగోలుదారు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వారివారి పేరుతో రిజిష్టరు చేయడం జరిగిందన్నారు.కావున ఇది 192 మంది వివిధ వ్యక్తుల పేర్లతో రిజిష్టరు కాబడిన భూమి అని సదరు భూమిని వారు కబ్జా చేసి ఫెన్సింగ్ వేయడం జరిగిందని,దీని వలన 192 మంది నిరాశ్రయులు మౌతామని ఆవేదన వ్యక్తం చేశారు.జతపరచడం అయినది.ప్రస్తుతం రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం సదరు ప్లాట్లను కొలవలేనని అన్నమయ్య జిల్లా కలెక్టరుకి పీజీఆర్ఎస్ నందు అర్జీ నెంబరు ఏఎన్ఎంవై 202506161295 అర్జీ సమర్పించడం జరిగిందన్నారు.ఇదే విషయమై ఆగష్ట్ 25,2025వ తేదీన మదనపల్లె సబ్ ఇన్స్పెక్టర్,తహశీల్దారుకి అర్జీ ఇవ్వగా మదనపల్లి తహశీల్దారు ప్లాట్ల వద్దకు చేరుకొని ప్లాట్లు కొనుగోలు చేసిన వారి దస్తావేజులను పరిశీలించి పక్కగా ఉన్నందున భాదితులకు పొజిషన్ ఇచ్చి,మిగిలిన ప్లాట్లు కొనుగోలు చేసిన వారు వారి వారి దస్తావేజులను పరిశీలన కొరకు తహశీల్దారు వారి కార్యలయంనకు తీసుకొని రావలసినదిగా తెలియజేశారన్నారు.ఆగష్ట్ 30,2025వ తేదీన ఒక నోటీసు బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని,తహశీల్దారు వారు పెట్టిన నోటీసును కబ్జాదారులలో ఒకరైన ప్లాట్లకు పక్కనే నివాసం ఉంటున్న వ్యక్తి నోటీసు బోర్డు తొలగించారని ఆరోపించారు.విషయం తెలుసుకున్న మేము అక్కడ చేరుకున్న అనంతరం కబ్జాదారులు మా మీద క్రిమినల్ కేసులు పెట్టిస్తామని మమ్మల్ని భయబ్రాంతులకు గురిచేస్తూ,చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మాకు కబ్జాదారుల నుండి ప్రాణహాని ఉందన్నారు.2 రోజుల క్రితం ప్రభుత్వ అధికారులకు మాకు న్యాయం చేయడం లేదని మనోవేదనతో ఇందులో ప్లాట్ కొనుగోలు చేసిన సీనియర్ సిటిజన్ మరణించడం జరిగిందన్నారు.కావున జిల్లా ఎస్పీ స్పందించి కబ్జాదారుల నుండి మాకు రక్షణ కల్పించి,మా ఫ్లాట్లను మాకు దక్కేవిధంగా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :