Friday, 31 July 2026 01:30:29 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన

Date : 10 June 2026 10:42 PM Views : 98

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 10 : తంబళ్లపల్లె మండలంలో ఉపాధి హామీ పథకంలో హార్టికల్చర్ కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత నివ్వాలని ఏపీ డి చందన సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన క్షేత్ర సహాయకులు సమీక్షలో ఆమె మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జలధార, జలహారతి పనులు త్వరగా పూర్తి చేసి ప్రతి సాగునీటి చెరువులు నీటితో కళకళలాడాలని సూచించారు. ఉపాధి హామీలు హార్టికల్చర్ లో భాగంగా ప్రకృతి వ్యవసాయం తో రైతులు కోరిన పండ్ల మొక్కల పెంపకానికి రైతులతో మాట్లాడి ఒప్పించాలన్నారు. మండలంలో మొదటి ప్రాధాన్యత క్రమంలో 200 ఎకరాలలో పండ్ల మొక్కల పెంపకానికి క్షేత్ర సహాయకులు కృషి చేయాలన్నారు. మండలంలో జలధార, జలహారతి కార్యక్రమంలో జరిగే ప్రతి పని ప్రతి నీటి బొట్టు సంరక్షణే ధ్యేయంగా పనులు చేయించాలన్నారు. ఎంపీడీవో ఎంవి ప్రసాద్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జలధార,జలహారతి పనుల నిర్వహణ పై అభినందిస్తూ మిగిలిన పనులు పూర్తిచేసి జల సంరక్షణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, బాల గంగాధర్, భూదేవి, కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, సరస్వతి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :