Thursday, 30 July 2026 06:09:40 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గాత్రికరెడ్డికి రూ.3 లక్షల PMNRF నిధులు మంజూరు

ఎంపి మిథున్ రెడ్డి చొరవతో మంజూరు -- శాంక్షన్ లెటర్ అందజేసిన నిస్సార్ అహమ్మద్

Date : 29 January 2026 08:15 PM Views : 262

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గాత్రికరెడ్డికి రూ.3 లక్షల PMNRF నిధులు -- ఎంపి మిథున్ రెడ్డి చొరవతో మంజూరు -- శాంక్షన్ లెటర్ అందజేసిన నిస్సార్ అహమ్మద్ బోన్ మ్యారో క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి గాత్రికరెడ్డి వైద్య ఖర్చుల కోసం రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి ప్రదానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. ‌గురువారం అవెన్యూ రోడ్డులోని వైసిపి కార్యాలయంలో సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ చేతులమీదుగా రూ.3 లక్షల శాంక్షన్ లెటర్ చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేసినారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కుల,మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా సహాయం చేయడానికి పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి ఎల్లప్పుడూ సిద్దంగా వుంటారని కొనియాడారు. ‌చిన్నారి గాత్రికరెడ్డి క్యాన్సర్ తో బాధపడుతు వెలూరు సిఎంసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల కోసం ఎంపి మిథున్ రెడ్డి ని కోరగా పిఎం‌ఎన్ఆర్‌ఎఫ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని వివరించారు. ‌ఈ మొత్తం డైరెక్ట్ గా ఆసుపత్రికి బదిలీ చేస్తారని, పిఎంవో నుంచి నిధులు మంజూరు అయినట్లు వచ్చిన శాంక్షన్ లెటర్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు ఎంపి‌ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‌ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :