నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబరు 01 : తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లి తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షుడి గా షామీర్ భాష ఎన్నికైనట్లు మండల అబ్జర్వర్ టీజీ వెంకటేష్ తెలిపారు. సోమవారం రేణుమాకులపల్లిలో జరిగిన టిడిపి కార్యవర్గ సమావేశంలో షామీర్ భాష ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. రేణుమకులపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతన కమిటీ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News