Friday, 31 July 2026 02:39:54 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఘనంగా ఫోర్డు సంస్థ 32వ వార్షికోత్సవ సంబరాలు

32సంవత్సరాలు గా నిర్విరామ సేవా కార్యక్రమాలు అందిస్తున్న లలితమ్మ

Date : 25 November 2025 10:40 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 25 : పోర్డ్ సంస్థ ద్వారా 32 ఏళ్లుగా నిర్విరామ సేవా కార్యక్రమాలు - ఘనంగా సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ కు అభినందనలు - శుభాకాంక్షలు తెలిపిన సంస్థ సభ్యులు, పలువురు ప్రముఖులు. మదనపల్లె డివిజన లో 32 సంవత్సరాలుగా సమాజ సేవలో పోర్డ్ సంస్థ సేవలు అందిస్తూ తమదైన గుర్తింపును సొంతం చేసుకుందని మంగళవారం సంస్థ కార్యాలయం నందు డైరెక్టర్ జల్లా లలితమ్మ ను అభినదించారు. సంస్థ కుటుంబ సభ్యులతో కలిసి నిరాడంబరంగా సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టరు. సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ మాట్లాడుతూ పోర్డ్ సంస్థ సిబ్బంది,దాతలు,అధికారులు సహాయ,సహకారాలతో లక్ష్యాలు చేరుకొని,పురోభివృద్ధి సాదిస్తున్నామన్నారు. గడచిన 32 సంవత్సరాల నుండి దళితులు ఆదివాసీల హక్కులు,అభివృద్ధి,మహిళల ఆర్థిక స్వావలంబన,మహిళల్లో చైతన్యం తీసుకురావటం,బాల కార్మికుల నిర్మూలన,బాల్య వివాహాల నిర్మూలన,నిర్బంధ విద్యాహక్కుచట్టం అమలుతో పాటు అనేక కార్యక్రమాలపై పోర్డ్ సంస్థ ముందుకు సాగుతోందని వివరించారు. ముఖ్యంగా దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటంతో పాటు కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే అది పిల్లల విద్యాభ్యాసంతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజల్లో గట్టిగా వినిపించి అవగాహన కల్పించడం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆధునిక పోకడలతో ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు,వ్యవసాయంలో పెరిగిపోతున్న క్రిమిసంహారక మందుల వినియోగం,ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం,తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధంగా రైతాంగంలో చైతన్యాన్ని తీసుకువచ్చి అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ అంశాలపై పోర్టు సంస్థ మున్ముందు కూడా తమ ఆశయాల సాధన కోసం ముందుకు సాగుతుందన్నారు.అలాగే తనను అభిందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోర్టు సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ నిర్మల,కో-ఆర్డినేటర్ సుభాషిణి,మండల కో-ఆర్డినేటర్లు ఎ.నరసింహులు, ఎం.నరసింహులు, సంస్థ కోశాధికారి హేమంత్ కుమార్,సిబ్బంది అల్తాప్,జయలక్ష్మి,జలజాక్షి,స్వర్ణ,భువనేశ్వరి,అనిత,రెడ్డమ్మ, శైలజ,రమణ,శివన్నలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :