Tuesday, 09 June 2026 09:37:29 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

వెబ్ ల్యాండ్ సమస్యలకు పరిష్కారం

రైతులకు 1B, పత్రాల పంపిణీ - కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 23 March 2026 09:02 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23 : రెవెన్యూ వెబ్ల్యాండ్ సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిరంతరం చర్యలు చేపడుతోందని,, ఇందులో భాగంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రెవెన్యూ వెబ్లాండ్ సమస్యలకు పరిష్కారం చూపుతూ.. మదనపల్లి, రాయచోటి సబ్ డివిజన్లో 10 వెబ్ ల్యాండ్ 1బి అడంగల్ పత్రాలకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆమోదం తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి, మదనపల్లి సబ్ డివిజన్ల పరిధిలో గత అనేక సంవత్సరాలుగా సర్వే నంబర్ సవరణలు, సర్వే నంబర్ అడిషన్స్, అడంగల్ వివరాల సరిదిద్దడంపై పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చూపిన ప్రత్యేక చొరవతో ఏళ్ల తరబడి పరిష్కారం కాని పలు రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వెబ్ ల్యాండ్ సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించడంతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్, రాయచోటి ఆర్.డి.ఓ ఆమోదించిన 10 వెబ్ ల్యాండ్ 1B పత్రాలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని కోర్ట్ హాల్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో 10 మంది రైతులకు వెబ్ ల్యాండ్ సమస్యలు పరిష్కరించి సంబంధిత 1B పత్రాలను జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులకు అందజేశారు. మిగిలిన దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకుని పూర్తిస్థాయిలో పరిష్కారం కల్పిస్తామని పేర్కొన్నారు. మదనపల్లి సబ్ డివిజన్ రామసముద్రం,నిమ్మనపల్లె, గుర్రంకొండ, రాయచోటి సబ్ డివిజన్ క్రింద సంబేపల్లి తదితర గ్రామాలకు చెందిన పలు రెవెన్యూ సమస్యలకు సంబంధించి 1బి పత్రాలను నేడు జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులకు అందజేశారు. అదే విధంగా 22ఏ భూమి సమస్యలకు సంబంధించి ఈ నెల మొదట వారం లో డెబ్బై రెండు, ఈ వారం లో డెబ్బై 22ఏ భూమి సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లి, రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో వెబ్ ల్యాండ్‌కు సంబంధించి వచ్చిన 10 దరఖాస్తులను సంబంధిత రెవెన్యూ రికార్డులు, పాత దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించినట్లు తెలిపారు. ముఖ్యంగా గత తొమ్మిది నుంచి పది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకున్నదని తెలిపారు. భూమి రికార్డులు సరిగ్గా ఉండటం రైతులకు అత్యంత ముఖ్యమని, భూమి లావాదేవీలు, పంట రుణాలు మరియు ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో వెబ్ ల్యాండ్ రికార్డులు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే జిల్లా పరిపాలన ముఖ్య లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా రెవెన్యూ శాఖ అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :