Friday, 31 July 2026 05:38:25 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ డే–2026 వేడుకలు

Date : 28 February 2026 06:49 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు – విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ డే–2026 వేడుకలు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల, మదనపల్లెలో జాతీయ సైన్స్ డే–2026ను ఫిబ్రవరి 28, 2026న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల BS&H విభాగం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. ఎన్. రాజా గోపాల్ రెడ్డి, డా. కె. కృష్ణవేణి, డా. జి. రమేష్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి కన్వీనర్ మరియు BS&H విభాగాధిపతి డా. చ. కల్యాణి నేతృత్వం వహించగా, BS&H విభాగంలోని సమస్త అధ్యాపకులు సహకారం అందించారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం బీ.టెక్ విద్యార్థుల కోసం “గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రాలలో కృత్రిమ మేధస్సు (AI) అనువర్తనలు” అనే అంశంపై పేపర్ ప్రెజెంటేషన్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలు, పరిశోధనా దృష్టికోణంతో ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పోటీలలో భౌతిక శాస్త్రం విభాగంలో బి. హేమంత్ (AIML) విజేతగా నిలిచారు. రసాయన శాస్త్రం విభాగంలో లిఖిత (AIDS) ప్రథమ బహుమతి సాధించారు. ఆత్మీయ బహుమతిను ఘ్నేయ (AIML) అందుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు, ఆధునిక సాంకేతికతలైన AI వినియోగంపై అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మరియు యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి కార్యక్రమాలు ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొనవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమనందు వైస్ ప్రిన్సిపాల్ టీఎస్ గౌస్ బాషా మొదటి సంవత్సరం అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :