Friday, 31 July 2026 07:51:20 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మైక్రోసాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు

ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా కర్ణాటక లోని కంపెనీ లను సందర్శించిన విద్యార్థులు

Date : 08 February 2026 08:56 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 08 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం ఆధ్వర్యంలో బి.టెక్ రెండో సంవత్సరం డేటా సైన్స్‌కు చెందిన 70 మంది విద్యార్థులు మరియు అధ్యాపకుల బృందం కలిసి ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ కంపెనీని సందర్శించారు. విద్యార్థులకు పరిశ్రమ అనుభవం మరియు పరిశోధనలపై అవగాహన అందించడమే ఈ విజిట్ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌లో డేటా అనలిటిక్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న సగ్నిక్ బెనర్జీ డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ టెక్నాలజీలు వంటి తాజా సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహనాత్మకమైన మరియు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థలో కొనసాగుతున్న పరిశోధనలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో మైక్రోసాఫ్ట్‌లో విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు నూతన జెనెరేటివ్ ఏ.ఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని , భవిష్యత్ కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్.ఎం. కిరణ్, రూపా, మంజుల మరియు డాక్టర్. జి. కిరణ్ కుమార్ ల బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :