Thursday, 16 April 2026 04:23:51 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి లో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అశ్వ్ 2కె26

ఆకట్టుకొన్న సినీ ప్రముఖుల ఆట పాటలు

Date : 26 March 2026 08:48 PM Views : 138

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 26 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2కె26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను ఘనంగా జరుపుకున్నారు. రెండవ రోజు కార్యక్రమాన్ని యూనివర్సిటీ నందు సినీ హీరో శర్వానంద్ మరియు హీరోయిన్ మాళవిక నాయర్ లు విద్యార్థులను అలరించారు. విద్యార్థులతో తన సాంగ్స్ తో అలరించారు. కార్యక్రమం లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ లో అనుభవించిన ఒడిదుడుకులను విద్యార్థులకు వివరిస్తూ, ప్రతి ఒక్కరికి ఓపికా, సహనం చాలా అవసరం అన్నారు. విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పైకి రావడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని, భవిష్యత్తును తీర్చిదిద్దుకోడానికి అధ్యయనం, అబ్యాసం, శిక్షణ, పరిశోధన ప్రత్యేక నైపుణ్యాలు అవసరమన్నారు. విద్యార్థులు తమ లక్షాలను సాధించడానికి ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా చివరిగా లక్ష్యం సాధించాలని ఆయన అన్నారు. డాన్స్ తో విద్యార్థులను అలరించారు. ప్రతి ఒక్కరికి విద్యార్ధి దశ ఎంతో ముఖ్యమని, ఈ విద్యార్ధి దశను మనం ఆస్వాదించాలని, మనకు మల్లా కావాలన్నా రానిది విద్యార్ధి దశ అని అన్నారు. కావున ఆనందంగా విద్యార్ధి దశ ను ఎంజాయ్ చేయండి అని విద్యార్థులతో అన్నారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం మెంబెర్స్ సద్దాం హుస్సేన్, బిందాస్ భాస్కర్, నవ సందీప్, జబర్దస్త్ పులి వంటి ప్రముఖ కళాకారులు తమ వినోద ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారి హాస్య విన్యాసాలు, స్టేజ్ ప్రదర్శనలు విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ నాదెళ్ళ ద్వారకనాథ్ , వైస్ ఛాన్సల్లర్ డాక్టర్. సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక, డ్యాన్స్ మరియు ఇతర కార్యక్రమాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :