Friday, 31 July 2026 01:51:00 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మదనపల్లె చూట్టూ జరుగుతున్న ఫేక్ పట్టాలు, భూ కబ్జాలపై చర్యలు ఏవీ....??

దళిత వికలాంగుడు రవితేజకు అండగా YSRCP నాయకులు, ఇంచార్జ్ నిస్సార్ అహమ్మద్

Date : 09 May 2026 04:42 PM Views : 158

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 09 : మదనపల్లె నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలకు , అధికార యంత్రాంగం తోడు కావడంతో YSRCP వారు చిన్న పొరపాటును కూడా భూతద్దంలో చూస్తూ వేధింపులకు గురి చేయడం రివాజుగా మారిందని, మదనపల్లె చూట్టూ జరుగుతున్న భూ కబ్జాలు, ఫేక్ పట్టాలపై చర్యలు ఏవీ అంటూ మదనపల్లె YSRCP ఇంచార్జ్ నిస్సార్ అహమ్మద్ ప్రశ్నించారు మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లెకు చెందిన దళిత వికలాంగుడు, YSRCP సోషల్ మీడియా కన్వీనర్ రవితేజ ఇంటిపై JCB తో వెళ్ళి నిర్మాణాన్ని కుల్చివేసి బాత్రూమ్‌ను పూడ్చివేయడాన్ని తెలుసుకున్న మదనపల్లె నియోజకవర్గ YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ బాధితుడు రవితేజ కుటుంబాన్ని శనివారం పరామర్శించి, అండగా వుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.‌YSRCP సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్న దళిత వికలాంగుడిపై దౌర్జన్యానికి పాల్పడటం, మహిళల పట్ల దౌర్జన్యం చేసే నైజం గా కూటమి ప్రభుత్వ అసలు స్వరూపం, ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ కక్షసాధింపుకు ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. మదనపల్లె చూట్టూ భూ కబ్జాలు, ఫేక్ పట్టాలు రాజ్యమేలుతోందని వీటిపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రంగం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తోందని మండిపడ్డారు. ‌జగన్ 2.0 లో కార్యకర్తలకు అండగా నిలవడానికి డిజిటల్ బుక్ తీసుకుని రావడం జరిగిందని, ఇందులో నమోదు చేసి YSRCP ప్రభుత్వం అధికారంలోకి ఈ ఘటనతో బయటపడిందని అన్నారు. YSRCP కి చెందిన కార్యకర్తలు, నాయకులు చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపిస్తూ నిరంతరం వేధింపులు, అక్రమ కేసులు, దాడులు జరగడం రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని అణచివేత చర్యలకు దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. మదనపల్లె నియోజకవర్గంలో ముఖ్యంగా వచ్చిన వెంటనే న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. YSRCP వారిని సెకండ్ క్లాస్ పౌరులుగా చూస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బలహీన వర్గాల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం వారి పైనే దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రవితేజ కుటుంబానికి YSRCP అండగా ఉంటుందని, ఈ ఘటనపై న్యాయపరంగా, ప్రజా ఉద్యమాల ద్వారా పోరాడతామని స్పష్టం చేశారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడే వారు భవిష్యత్ లో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, YSRCP మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, దావూద్, రఫీ, ముబారక్, అయూబ్, ఖాదర్ భాషా, ఎహసాన్, వీరయ్య, కొత్తపల్లి నాగార్జున నాయుడు, సాధిక్, విష్ణు వర్ధన్ రెడ్డి, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, అబ్దుల్లా, మాలేపాటి చలపతి, జబి, నజీర్, రియాజ్, నాగరాజ్ జాబీర్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :