నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఘనంగా ఎల్లంపల్లి ప్రశాంత్ జన్మదిన వేడుకలు. నేడు భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ జన్మదిన వేడుకలు మదనపల్లి రూరల్ మండలం సిటిఎం గ్రామం నందుగల హరి డిఫెన్స్ కోచింగ్ సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఎన్డీఏ పార్టీ నాయకులు మరియు విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులందరూ ఎల్లంపల్లి ప్రశాంత్ మరింతగా ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో సామాజిక సేవలో మరింత ముందుకెళ్లి గ్రామీణ ప్రాంతంలో మరిన్ని విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ డాకరాజు రెడ్డి రాంప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చల్లా నరసింహులు వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మదనపల్లి మండల అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ చల్లా శ్రీనివాసులు, తెలుగు యువత నాయకులు రాజశేఖర్ @ మిట్టపల్లి రాజు, రాయలసీమ స్టూడెంట్స్ ఫెడరేషన్ కన్వీనర్ వలిపి ఉత్తన్న, బిజెపి మదనపల్లె మండల అధ్యక్షుడు తరీగొండ వెంకటరమణారెడ్డి, మరియు బిజెపి యువ నాయకుడు శివప్రసాద్, డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ మరియు నేషనల్ రన్నింగ్ ఛాంపియన్ హరిప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News