నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె కదిరి రోడ్డులోని వక్ఫ్ బోర్డు భూములకు జామియా మసీదు కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదని బాధితులు నూర్జహాన్ బేగం, శవాల్ బేగం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం వారు తమ స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు మసీదు పెద్దలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయితే వక్ఫ్ బోర్డు భూములు పూర్వీకుల నుంచి తమకు సంక్రమించాయని, ఇందులో ఎలాంటి కబ్జాలు లేవన్నారు. గత ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డు చట్టప్రకారం సగం భూమి వక్ఫ్ బోర్డుకు, మిగతా సగం భూమి తమ పూర్వీకులకు కేటాయించారన్నారు. అయితే వక్ఫ్ బోర్డు భూముల వివాదం తెరపైకి రావడంతో కోర్టులో కేసు వేశామన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోందని అక్కడే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా న్యాయస్థానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వక్ఫ్ బోర్డు భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని కమిటీ పెద్దలు భూముల అన్యాక్రాంతంపై చర్చకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతం, దురాక్రమణ, ఇతర అంశాలపై కోర్టులో కేసు వేశామని వివరించారు. కోర్టు కేసుపై ఎవరూ జోక్యం చేసుకోకూడదన్నారు. న్యాయస్థానం తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. అయితే ఈ భూములకు కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వక్ఫ్ బోర్డు భూములపై రాజకీయం చేయడం తగదన్నారు. కమిటీ పెద్దలు రాజకీయ కోణంలో ఆలోచిస్తూ వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది తమ పూర్వీకులు కొనుక్కున్న భూమని వారినుండీ సంక్రమించిన ఈ భూమికి తామే వారసులమన్నారు. ఈ భూమితో కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అనవసరంగా జోక్యం చేసుకుని రాజకీయ రంగు పులిమారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News