Thursday, 30 July 2026 07:05:51 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

చల్లా రవికుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా భారీ రక్తదాన శిబిరం నిర్వహించిన అభిమానులు

Date : 02 July 2026 04:08 PM Views : 93

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జూలై 02 : ఆత్మకూరు మాజీ ఉపసర్పంచ్ పట్టణ సీనియర్ రాజకీయ నేత చల్లా.రవికుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి అభిమానులు సన్నిహితులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.. ఆత్మకూరులో భారీ మెగా రక్తదాన శిబిరం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మొదట పట్టణంలోని పోలేరమ్మ, వినాయక స్వామి దేవాలయలలో వారి రాజకీయ అభివృద్ధి, క్షేమాన్ని ఆకాంక్షిస్తూ 51 టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంచారు. అనంతరం ఓందూరుగుంట ప్రాంతంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల రక్త సేకరణ విభాగం సహకారంతో భారీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.. ఈ శిబిరానికి వారి అభిమానులు భారీగా పాల్గొని రక్తాన్ని అందించారు..ఈ కార్యక్రమాలను చల్లా రవికుమార్ రెడ్డి అభిమానులు షరీఫ్, మాజీ వార్డ్ కౌన్సిలర్ గందెల్ల వేణు, మహీంద్రా, జస్వంత్, చందు, కళ్యాణ్, మనోహర్, చల్లా రవికుమార్ రెడ్డి అభిమానులు సన్నిహితులు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాలు నిర్వాహకులు చల్లా రవికుమార్ రెడ్డి అభిమాని షరీఫ్ మాట్లాడుతూ మా అన్న చల్ల రవికుమార్ రెడ్డి జన్మదినం అంటే తమకు పండుగ లాంటిదని వారి క్షేమాన్ని కాంక్షిస్తూ దైవ ప్రార్థనలు,రక్తదాన శిబిరాలు నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందని వారు నిండు నూరేళ్లు సంతోషకరంగా ఉంటూ రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపారు.. సాదిక్ హుస్సేన్ మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో రక్త సేకరణ నిర్వహించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందించారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: