Thursday, 30 July 2026 11:56:13 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా

Date : 13 April 2026 06:50 PM Views : 231

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా - ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై.వనజ వెల్లడి మదనపల్లె : కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ (నారీశక్తి నందన్ అధినీయమ్) బిల్లు అమలులోకి తీసుకురానున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలి కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల నందు సోమవారం స్త్రీ శక్తి పేరిట అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ఎరికిపాటి వనజ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వనజ మాట్లాడుతూ మహిళల కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలు పొందుపరిచారని,తద్వారా మహిళలు అని రంగాలలో రాణిస్తున్నారని కొనియాడారు.అయితే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న (నారీశక్తి నందన్ అధినీయమ్) పథకం మహిళా సాధికారతకు భరోసానిస్తుందన్నారు.ఇది రాజకీయ సమానత్వానికి దోహదపడుతుందన్నారు.2029 సంవత్సరం నుండి ఈ బిల్లు అమలులోకి వస్తుందని వెల్లడించారు.మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.విపత్కర పరిస్థితుల్లో మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగడానికి ఈ చట్టాలను వినియోగించుకోవాలన్నారు.అనంతరం కో-ఆర్డినేటర్ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు ఉపయోగపడే అనేక పథకాలు,కార్యక్రమాలను రూపొందించాయన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించడం శుభసూచకమన్నారు.నూతనంగా తీసుకొస్తున్న ఈ చట్టం మహిళలకు ఓ వరమని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు యాస్మిన్,నాగమణి,బషీర్ అహ్మద్ మరియు విద్యార్థినీలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :