నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు -ఫిబ్రవరి 26 : ఆత్మకూరు మండలంలోని పమిడిపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీవో బి.పావని నేడు పరిశీలించారు.. గ్రామంలోని 810 ఎకరాల భూములను భూ స్థితిని హద్దులను పరిశీలించి నూతనంగా నమోదు చేసే ప్రక్రియకు సిబ్బంది చేపట్టారు.. ఇక్కడ జరుగుతున్న భూ రీసర్వే విధానాన్ని నేడు ఆర్డిఓ గ్రామానికి వచ్చి పరిశీలించి భూముల వివరాలు వాటి యజమానుల వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన సమయంలోగా సర్వే పూర్తి చేయాలని సూచించారు. గ్రామ రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ వెంకటేశ్వర్లు, గ్రామ సర్వేలు ఖాదర్ బాషా, రాజీప్ లు వీఆర్వో బాబు, ఆర్డీవో కార్యాలయ సర్వేరర్ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News