Friday, 31 July 2026 01:34:41 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ యాజ్ కెరీర్ అప్పార్చునిటీస్ పై వర్క్ షాప్

ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా వర్క్ షాప్

Date : 24 November 2025 06:24 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో "ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ యాజ్ కెరీర్ అప్పార్చునిటీస్" అనే అంశంపై అవగాహన వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేటర్ విశాల్ విజయ్ నాయర్, వాధ్వాని ఫౌండేషన్, బెంగళూరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, కొత్త ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా మార్చి పరిశ్రమలను అభివృద్ధి చేసే పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం అత్యంత అవసరం అని అన్నారు. సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణాత్మక దృక్పథం, రిస్క్ తీసుకునే ధైర్యం మరియు సరైన ప్రణాళిక ద్వారా యువత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలదని సూచించారు. ఒక ఆలోచనను విజయవంతమైన ఉత్పత్తి లేదా సేవగా మార్చే ప్రక్రియలో దృష్టి, వ్యూహం, పట్టుదల, పరిశ్రమలతో కోలాబరేషన్ వంటి అంశాలు అత్యంత ముఖ్యమని వివరించారు. అలాగే పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న NBMSME, KVIC, NSIC, NSIEDB వంటి పథకాల ద్వారా స్టార్ట్-అప్‌లు, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు, మరియు యువ పారిశ్రామిక వేత్తలకు అవసరమైన ఆర్థిక సహాయం, మెంటరింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులలో ఉన్న ఆలోచనలను వాస్తవికతగా మార్చి కొత్త స్టార్ట్-అప్‌లుగా అభివృద్ధి చేయడమే భవిష్యత్తులో అత్యుత్తమ కెరీర్ అవకాశమని, ఈ ప్రయాణం సమాజ అభివృద్ధి మరియు దేశ పురోగతికి దోహదం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో డీన్ -అకాడెమిక్స్ డాక్టర్ రామ కే కొమరగిరి, విభాగాధిపతి డాక్టర్ ఎస్.భాస్కరన్, ఈ.డి సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కే.శిరీష, కోఆర్డినేటర్స్ డాక్టర్ బి.ప్రవీణ్ కుమార్, పి.మొహమ్మద్ రిజవాన్ అలీ, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :