నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 09 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ మహా శివుని సన్నిధిలో ఢమరుక వాయిద్యం వాయించే శారదయ్య సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్దమండెం మండలం కొండ కింద కురువపల్లెకు చెందిన శారదయ్య దశాబ్దాలుగా మల్లయ్య కొండ స్వామి వారి సేవ లో భాగంగా పరిసర ప్రాంతాలలో మల్లయ్య దారుల వేషధారణలో మహాశివుని స్మరిస్తూ ప్రచారం నిర్వహించేవాడు. గత సోమవారం సైతం మల్లయ్య కొండలో స్వామి వారి సన్నిధిలో ఢమరుక వాయిద్యం వాయించి రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతకు లోనై సోమవారం మృతి చెందాడు. శారదయ్య మృతిపై ఈఓ ముని రాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట, అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామి, ఆలయ సిబ్బంది ఆయన స్వామి చేసిన సేవలను కొనియాడుతూ సంతాపం ప్రకటించారు
Reporter
Namitha News