Thursday, 16 April 2026 04:22:19 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కణ

Date : 06 April 2026 01:09 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిషిత రాజు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీమతి నిషిత రాజు మాట్లాడుతూ దేశ సరిహద్దులను పరిరక్షించడం, అంతర్గత భద్రతను పటిష్టం చేయడం, అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడం లేదా భారతీయ సంస్కృతి యొక్క చరిత్రను, జీవన విధానాలను పునరుజ్జీవింపజేయడం - ఇలా అన్ని విషయాలలోనూ బీజేపీ తన సంకల్పాలను ఆచరణలో చూపించింది. జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ మాట్లాడుతూ బీజేపీ యొక్క మూల మంత్రం "దేశమే ప్రథమం, పార్టీ తదుపరి, వ్యక్తి చివరగా". ప్రతి బీజేపీ కార్యకర్త ఈ ప్రధాన భావనతోనే, రేయింబవళ్లు దేశ సేవకు అంకితమై పనిచేస్తున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జాతీయ ప్రయోజనాలనే మహాయజ్ఞంలో తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, బీజేపీని ఒక మహా వటవృక్షంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దేశ సేవ, విలువలతో కూడిన రాజకీయాలు మరియు అభివృద్ధి పట్ల పార్టీకి ఉన్న నిబద్ధత నిజంగా ప్రశంసనీయం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, ఈ అద్భుతమైన స్థానానికి పార్టీని చేర్చింది ప్రతి కార్యకర్త యొక్క అంకితభావం, త్యాగం మరియు కఠోర శ్రమే. ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి ప్రశాంత్, నరేంద్ర రెడ్డి, ఆనంద్, బాలజ్యోతి, కృష్ణమూర్తి, మోహన్, పురుషోత్తం, భగవాన్, మధు, నాగరాజు, వెంకటరమణ రెడ్డి, జర్మన్ రాజు, శ్రీకాంత్, నాయక్, నారద రెడ్డి, రవి, కిరణ్, జగదీష్, వర్మ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :