Friday, 31 July 2026 03:52:54 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ - సత్ సంఘ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరం

Date : 29 May 2026 08:59 PM Views : 59

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : మదనపల్లి సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మిట్స్ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం మరియు మదనపల్లికి చెందిన సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని స్వస్థత హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ శిబిరంలో యూనివర్సిటీ విద్యార్థులు, బోధనా మరియు బోధనేతర సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ నేటి జీవనశైలిలో పని ఒత్తిడి, సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం మరియు చెడు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పోషకాహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, కనీసం ఆరు గంటలపాటు నిద్రకు సమయం కేటాయించడం వంటి మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చని పేర్కొన్నారు. స్వస్థత హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్ శశికళ (జనరల్ మెడిసిన్), డాక్టర్ శ్వేత మహేశ్వరీ (గైనకాలజీ), డాక్టర్ కీర్తిష్ (ఆర్థోపెడిక్) విభాగాలకు చెందిన వైద్యులు విద్యార్థులు మరియు సిబ్బందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ టి.జి రవి కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాషా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చెన్నయ్య, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ పి. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :