Thursday, 30 July 2026 05:55:37 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...!

Date : 13 April 2026 10:53 PM Views : 200

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం క్లైమాక్స్ కు చేరింది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా మార్గమైన హార్మూజ్ జలసంధిపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా బృందం మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస బెట్టి వార్నింగ్ లు ఇస్తున్నారు. హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామని తాజాగా హెచ్చరించారు. అందుకు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా అమెరికాపై విరుచుకుపడుతోంది. అమెరికా అలా చేస్తే హార్మూజ్ సుడిగుండాల్లో ఆ దేశ సైన్యం కొట్టుకుపోతుందని వార్నింగ్ ఇచ్చింది. ఇక తాజాగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో.. అమెరికా నేవీ ఫోర్స్.. హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడం ప్రారంభించింది. ఇరాన్ నుంచి వచ్చి పోయే నౌకలను అమెరికా నేవీ అడ్డుకుంటోంది. సోమవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ ప్రక్రియను ప్రారంభించింది అమెరికా. ఇక ఇరాన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే హార్మూజ్ వద్ద భారత్ కు చెందిన దాదాపు 15 నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. ఈ నౌకల్లో అధికంగా ఎల్పీజీ, ముడి చమురు, ఎల్ఎన్జీ ఉంది. దాంతో భారత్ లో రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రిటైల్ ధరలను పెంచని నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఐఓసీ, హెపీసీఎల్, బీపీసీఎల్ లు పెట్రోల్ పై లీటర్ కు రూ. 24 అలాగే డీజిల్ పై లీటర్ కు రూ. 30 వరకు నష్టపోతున్నట్లు తెలుస్తోంది. ఇక ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎక్సైజ్ టాక్స్ ను లీటర్ కు రూ. 10 తగ్గించింది. అయితే భారత్ వద్ద ఇంకా దాదాపు రెండు నెలల వరకు సరిపడా నిల్వలు ఉన్నా .. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తే మన దేశానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఏప్రిల్ 14 నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.77 ఉండగా రేపటి నుంచి లీటర్ పెట్రోల్ ధర రూ. 102- 105 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 103 నుంచి రూ. 112 కు పెరిగే ఛాన్స్ ఉందట. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 102.92 నుంచి రూ. 110-113 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: