Thursday, 16 April 2026 04:22:15 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

సబ్-రిజిస్ట్రార్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

రూ .50 లక్షలు, ఇంటి స్థలం డిమాండ్

Date : 28 March 2026 08:46 AM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సబ్-రిజిస్ట్రార్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్... రూ.50 లక్షలు, ఇంటి స్థలం డిమాండ్.. మదనపల్లి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రభుత్వ అధికారి అయిన సబ్-రిజిస్ట్రార్ ను లక్ష్యంగా చేసుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేయాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మదనపల్లె వన్ టౌన్ పోలీసుల తెలిపిన వివరాల మేరకు, చిత్తూరు జిల్లాకు చెందిన పెన్ పవర్ విలేఖరి బూరగన్ దొర స్వామి (45), మదనపల్లెకు చెందిన మాజీ సబ్ రిజిస్టర్ మోసూరు కోదండరామయ్య (65) కలిసి బాధితుని వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన స్థిరాస్తి వివరాలను సేకరించారు. ఆ వివరాలను ఆధారంగా తీసుకొని ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా నిరంతరం బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా బాధితుడు మరియు అతని బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లి ఫోటోలు తీసి పంపిస్తూ ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఒక ఇంటి స్థలం ఇవ్వాలని లేకపోతే దానికి సమానంగా రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా మార్చి 26న మదనపల్లి–బెంగుళూరు హైవేపై అభి హోటల్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమ నేరాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :