నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 05 : అన్నమయ్య జిల్లా మండల కేంద్రం లోని అతి పురాతన చంద్రశేఖర స్వామి ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, దిగువపేట సర్కిల్ నుండి ఆలయం వరకు విద్యుత్ దీపాలు పచ్చని తోరణాలతో అలంకరణ చేశారు.ఆలయం ప్రధాన అర్చకులు బాలాస్వామి, రవి స్వామి ఉదయం స్వామి వారి ఆలయ శుద్ధి చేసి అభిషేకాలు అర్చనలు నిర్వహించి పలురకాల పుష్పాలతో స్వామి వార్లను అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.సాయంత్రం జ్వాలాతోరణం, అకాశదీపం,తెప్పోత్సవం సందర్బంగా ఆలయంలో భక్తులతో కిట కిట లాడాయి . వేకువ జామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం లో ఉత్సవ మూర్తులను మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అరటి పిల్లలు, విద్యుత్ దీపాలు, పలురకాల పుష్పాలతో అలంకరించిన తెప్ప పై శ్రీ పార్వతి సమేత చంద్రశేఖర స్వామి వార్లను కొలువుంచి, దివ్య పుష్కరిణిలో తె ప్పోత్సవ ఘట్టాన్ని కన్నులు పండువుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు తండోప తండాలుగా వచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు బాలా స్వామి, రవి స్వామి, స్వామి వారిని దర్శనం కల్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే బజారు వీధిలో వెలిసిన ఆలయం చెంబకూరు, మూగవాడి గుట్టపాల్యం దగ్గర కొండ పై వెలిసిన శివాలయాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళ లు ఒక్క పొద్దుతో స్వామి వారి ఆలయ ప్రాంగణం లో మహిళలు దీపారాధన చేశారు.చంద్రశేఖర స్వామి ఆలయం లో బాలా స్వామి,రవిస్వామి గ్రామస్థులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు .చంద్రశేఖర స్వామి ఆలయంలో దీపోత్సవం, తెప్పోత్సవం సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది బందోబస్తూ నిర్వహించారు.
Reporter
Namitha News