Thursday, 30 July 2026 10:33:54 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు

Date : 02 January 2026 07:45 PM Views : 151

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 02 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ని సందర్శించిన చంద్రగిరి ప్రభుత్వ పోలిటెక్నిక్ కళాశాల యొక్క ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్) విభాగం విద్యార్థులు యూనివర్సిటీ విజిట్ లో భాగంగా సందర్శించారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ పర్యటనలో విద్యార్థులు యూనివర్శిటీ లోని అత్యాధునిక ల్యాబొరేటరీలు, పరిశోధనా విభాగాలు మరియు సాంకేతిక వసతులను సందర్శించడం ద్వారా వారు పరిశ్రమలో జరుగుతున్న నూతన మార్పులు, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పద్ధతులు మరియు ప్రాక్టికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాల గురించి లోతైన అవగాహన పొందారు. కార్యక్రమంలో మిట్స్ ఈసీఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి.కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రచురణ, పరిశోధన మరియు ఆవిష్కరణలు అత్యంత కీలకమైనవని, ప్రచురణ ద్వారా విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు, సాంకేతిక పేపర్లు మరియు కొత్త ఆలోచనలు సమాజానికి, పరిశ్రమలకు తెలిసేలా అవుతాయని అన్నారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనా సామర్థ్యాన్ని ప్రతిబింబించడమే కాకుండా, ఉన్నత విద్య లేదా ఉద్యోగ అవకాశాల సమయంలో రెజ్యూమేకు అదనపు విలువను అందిస్తుంది అని అన్నారు. ఇలాంటి సందర్శన ద్వారా ఉన్నత విద్య అయిన బీటెక్ మరియు ఎంటెక్ కోర్సులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని, కాలేజీ క్యాంపస్ వాతావరణం, విద్యార్థి జీవితం మరియు కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసి ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ వి.పణి కుమార్ తెలిపారు. పరిశ్రమ–అకాడమీ సంబంధాలు, ప్లేస్‌మెంట్లు, ఇంటర్న్‌షిప్ అవకాశాల గురించి తెలుసుకోవడం ద్వారా కెరీర్ ప్లానింగ్ మరింత బలపడుతుంది. ఈ పర్యటన విద్యార్థుల పరిశ్రమ అవగాహనను పెంచి, వారి ఇంజనీరింగ్ రంగంలో భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ పోలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు పి.రజని మరియు వి.విజయ కుమార్ లు తెలిపారు. కార్యక్రమంలో ఈసీఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.రెడ్డి హేమంత, డాక్టర్ జి.సుబ్బారావు మరియు 50 మంది ప్రభుత్వ పోలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :