Friday, 31 July 2026 09:55:49 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఫుల్ స్ట్యా క్ వెబ్ డెవలప్మెంట్ పై వర్క్ షాప్

ముఖ్య అతిధిగా వి.ఐ.టి. ప్రొఫెసర్ డాక్టర్ తనపాల్

Date : 29 November 2025 06:12 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 29 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎం.సి.ఏ విభాగం వారు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనే అంశంపై వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైలోని వి.ఐ.టి, వేలూరు లో స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగం నందు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ తనపాల్ .పి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అనేది ఒక ఇంటర్నెట్ అప్లికేషన్‌లో ఫ్రంట్‌ఎండ్ యూజర్ చూసే భాగం మరియు బ్యాక్‌ఎండ్ లో డేటాబేస్, సర్వర్, లాజిక్ వంటి రంగాలలోనూ పనిచేయగల సాంకేతికత అని అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ నైపుణ్యానికి భారీ డిమాండ్ పెరగడం ద్వారా ఫుల్ స్టాక్ డెవలపర్లు ఫ్రంట్‌ఎండ్, బ్యాక్‌ఎండ్ రెండింటినీ నిర్వహించగలగడం వల్ల టీమ్‌పై ఆధారపడటం తగ్గి, ప్రాజెక్ట్ నిర్వహణ వేగంగా పెరుగుతోందని అన్నారు. విద్యార్థులకు ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్ అవగాహన ఉండటం వల్ల ఒక అప్లికేషన్ ఎలా రూపుదిద్దుకుంటుంది, డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది, యూజర్‌కు ఎలా కనిపిస్తుంది అన్నది పూర్తిగా అర్థమవుతుంది. ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రాజెక్ట్‌ మొత్తం అభివృద్ధి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ, ఒక్కరే ఒక టీమ్‌లా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకే ఐటి రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎన్.నవీన్ కుమార్, కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసన్ .జె, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :