నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 11 : ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజాదరణ మా పార్టీకే ఉందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హర్షద్వానాల మధ్య ప్రకటించారు. గురువారం ఆయన స్వగృహంలో తంబళ్లపల్లె ఎంపీపీగా ఎన్నికైన చిటికి శ్యామలా కోటిరెడ్డి, ఎంపీటీసీలను సన్మానించి అభినందించారు. ఆరు మండలాల నాయకులు, కార్యకర్తల మధ్య విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో జరగవలసిన ఎంపీపీ ఉప ఎన్నికలను కావాలని కుట్రతో వాయిదా వేస్తూ వస్తున్నారని అయినా తంబళ్లపల్లె ఎంపీపీగా శ్యామలా కోటిరెడ్డి ఎన్నిక మా విజయానికి నిదర్శనమన్నారు. బి కొత్తకోట ఎంపీపీ ఎన్నిక వాయిదా పై విమర్శిస్తూ అక్కడ కూడా విజయం మాదేనని ధీమాగా చెప్పారు. తంబళ్లపల్లె చరిత్రలో నిలిచిపోయే మల్లయ్య కొండ రోడ్డు, పిఆర్ గెస్ట్ హౌస్, పెద్దేరు ప్రాజెక్టు పార్కు అభివృద్ధి, బెంగళూరుకు బస్సు సౌకర్యం, సిహెచ్సీ అదనపు భవనాలు, ఆలయాల నిర్మాణం, ప్రతి గ్రామానికి లింకు రోడ్లు, సిమెంటు రోడ్లు, జగనన్న కాలనీలు, సచివాలయాలు, ఆర్ బి కే సెంటర్లు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణం, ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక పోగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి విద్యార్థులకు వైద్య విద్య అమ్మకానికి పెట్టి ప్రజాగ్రహానికి గురైనట్లు చెప్పారు. తంబళ్లపల్లెలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో పాలనలో విఫలమైనట్లు విమర్శించారు. ఈ కార్యక్రమంలో.రియల్టర్ గోపి దిన్ని మల్లికార్జున రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, కిషోర్ కుమార్ రెడ్డి, ఆరు మండలాల వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News