నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : నెల్లూరు - మే 23 : నెల్లూరు జిల్లా లోని కిసాన్ సెజ్ లో ఈనెల 27,28,29 తేదీలలో జరిగే మహానాడు సన్నాహకాల్లో భాగంగా,రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరియు మంత్రుల బృందం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూఖ్,అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత,అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్ర,బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు పలువురు కేబినెట్ సహచరులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు పాల్గొన్నారు.. ఈ భేటీలో, మహానాడు విజయవంతం కోసం పక్కా వ్యూహరచన చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన అగ్రనేతలు, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు
Reporter
Namitha News