నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 17 : హెచ్ఐవి బాధితులు ఎవరు అధైర్యపడవద్దని వారు ఏఆర్టి మందులు విధిగా వాడుతూ జీవిత కాలాన్ని పెంచుకోవాలని వైద్యాధికారిణి హితవు పలికారు. ఆదివారం సిహెచ్సీలో ఐసిటిసి కౌన్సిలర్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి హెచ్ఐవి రోగుల మృతులకు ఆత్మ శాంతి కలగాలని మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. హెచ్ఐవి తో మృతి చెందిన వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కృషి స్వచ్ఛంద సేవా సంస్థ మేనేజర్ శ్రీనివాసులు, ఓ డబ్ల్యు లు సావిత్రి, భారతి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News