Thursday, 30 July 2026 12:57:06 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

శాంతియుతంగా సంతోషంగా శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలి - ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ

మీ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా తప్పకుండా పోలీసు వారి అనుమతి తీసుకోవాలి

Date : 26 March 2026 08:57 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 26 : శ్రీరాముని ఆదర్శాలను స్మరించుకుంటూ.. ధర్మం, న్యాయం, ప్రేమ, కరుణ ఆయన జీవితంలోని ముఖ్యమైన అంశాలు. వీటిని మన జీవితాల్లో ఆచరించాలని, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. ప్రజలందరూ శాంతియుతంగా, సంతోషంగా, శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ పోలీసులకు సహకరించాలని, "మీ భద్రత మాకు ముఖ్యం" కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. మీ పరిధిలో మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పకుండా అనుమతి తీసుకోవాలి. ఇది మీ భద్రతకు, అలాగే ఆ ప్రాంతంలోని ప్రజలందరి భద్రతకు చాలా ముఖ్యం. మీరు అనుమతి తీసుకోవడం ద్వారా పోలీసులు ఆ కార్యక్రమం గురించి తెలుసుకుంటారని, అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారని, తద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించగలుగుతారని, కాబట్టి ఏదైనా కార్యక్రమం నిర్వహించేముందు పోలీసుల అనుమతి తీసుకోవడం బాధ్యతాయుతమైన పౌరులుగా మీ కర్తవ్యం అని ఎస్పీ గారు తెలిపారు. ప్రజలందరూ శాంతియుతంగా సంతోషంగా శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలని, అత్యవసరం అయితే వెంటనే స్తానిక పోలీస్ స్టేషన్ లేదా 112 నెంబర్ కు డయల్ చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పండుగ సందర్భంగా.. డీజే లాంటి కార్యక్రమాలను నిర్వహించరాదని, సాంప్రదాయ పద్ధతిలో పండుగ జరుపుకోవాలని, మైనర్లకు బైకులు ఇచ్చిన తల్లిదండ్రులు సంరక్షకుల పై కేసులు నమోదు చేయాలని, ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ.. సైలెన్సర్లు తీసివేసి బైకులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు

జిల్లా ప్రజలందరికీ పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :