Friday, 31 July 2026 10:45:47 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

Date : 12 December 2025 08:30 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 12 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ను పులివెందుల, లయోలా పోలిటెక్నిక్ కళాశాల మరియు పిళ్ళారిపట్టు ప్రభుత్వ పోలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ విజిట్ లో భాగంగా సందర్శించారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ పర్యటనలో విద్యార్థులు యూనివర్శిటీ లోని అత్యాధునిక ల్యాబొరేటరీలు, పరిశోధనా విభాగాలు మరియు సాంకేతిక వసతులను సందర్శించడం ద్వారా వారు పరిశ్రమలో జరుగుతున్న నూతన మార్పులు, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పద్ధతులు మరియు ప్రాక్టికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాల గురించి లోతైన అవగాహన పొందారని తెలిపారు.ఇలాంటి సందర్శన ద్వారా ఉన్నత విద్య అయిన బీటెక్ మరియు ఎంటెక్ కోర్సులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని, కాలేజీ క్యాంపస్ వాతావరణం, విద్యార్థి జీవితం మరియు కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసి ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని లయోలా పాలిటెక్నిక్ సీనియర్ లెక్చరర్ అరుణ రెడ్డి తెలిపారు. పరిశ్రమ–అకాడమీ సంబంధాలు, ప్లేస్‌మెంట్లు, ఇంటర్న్‌షిప్ అవకాశాల గురించి తెలుసుకోవడం ద్వారా కెరీర్ ప్లానింగ్ మరింత బలపడుతుంది. అదేవిధంగా ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు వంటి కార్యక్రమాలను చూసి కమ్యూనికేషన్, టీమ్‌వర్క్ వంటి వ్యక్తిగత నైపుణ్యాలపై అవగాహన పెరుగుతుంది. ఈ పర్యటనలో యూనివర్సిటీ అధ్యాపకులు మరియు సాంకేతిక నిపుణులు విద్యార్థులకు అనేక ఉపయోగకరమైన వివరాలను తెలియజేశారు. ఈ యాత్ర విద్యార్థుల పరిశ్రమ అవగాహనను పెంచి, వారి ఇంజనీరింగ్ రంగంలో భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ పోలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ భాస్కరన్, డాక్టర్ పద్మ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్-అడ్మిషన్స్ డాక్టర్ వి.మారుతీ ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: