Friday, 31 July 2026 07:32:36 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పుంగనూరు INTACH చాప్టర్ కన్వీనర్ -కో కన్వీనర్ ల నియామకం..

Date : 26 June 2026 08:07 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతదేశ సాంస్కృతిక, చారిత్రక, ప్రకృతి వారసత్వ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న INTACH (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) (భారత జాతీయ కళా సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ) సంస్థ, పుంగనూరు చాప్టర్ కి సరుం మహీపాల్ రెడ్డి గారిని కన్వీనర్, చిట్టిమిరెడ్డి భాస్కర్ రెడ్డి ని కో-కన్వీనర్ నియమించింది.ఈ మేరకు INTACH కేంద్ర కార్యాలయం,న్యూఢిల్లీ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ సరుం మహీపాల్ రెడ్డి మాట్లాడుతూ,తమపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన INTACH కేంద్ర కార్యాలయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరు ప్రాంతంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు,చెరువులు,శిలాశాసనాలు, సాంప్రదాయ కళలు మరియు సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కో-కన్వీనర్ చిట్టిమిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ,ఈ గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించిన INTACH కేంద్ర కార్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కన్వీనర్తో కలిసి వారసత్వ పరిరక్షణ, విద్యార్థుల్లో అవగాహన, యువత భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నియామక ప్రక్రియలో విశేష సహకారం అందించిన కె. చిన్నపరెడ్డి, INTACH కడప చాప్టర్ కన్వీనర్ మరియు INTACH గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు & ఓ. వెంకటేశ్వర రెడ్డి (INTACH కడప సభ్యులు) మరియు ఈ నియామక ప్రక్రియలో డా. శరణ్ కుమార్ రెడ్డి, త్రిమూర్తి రెడ్డి,సుధాకర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి తదితరులు సభ్యులుగా అందించిన సహకారం విశేషమైనది. వీరికి నూతన నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.పుంగనూరు చాప్టర్ ద్వారా హెరిటేజ్ వాక్స్, పాఠశాలలు మరియు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు,చారిత్రక కట్టడాల డాక్యుమెంటేషన్, సంప్రదాయ కళల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు, విద్యార్థులు,చరిత్రాభిమానులు, స్వచ్చంద సంస్థలు మరియు ప్రభుత్వ శాఖలు INTACH కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: