నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 09 : తంబళ్లపల్లి మండలంలో ఉపాధి హామీ పనులు పెంచి కూలీలకు ఉపాధి చూపించకపోతే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడి వెంకటరత్నం క్షేత్ర సహాయకులను హెచ్చరించారు. మంగళవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీలకు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉపాధిలో ఫారం పాండ్స్, కంపోస్ట్ ఫిట్స్, పశువుల షెడ్లు, సోంపిట్సి నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలన్నారు. గతంలో ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారంలోపు పనులు ఊపందుకోవాలన్నారు. ఫారం పాండ్స్ , కంపోస్ట్ ఫిట్స్ రైతుల పొలాలతోపాటు ప్రభుత్వ స్థలాలలో పనులు చేపట్టాలన్నారు. జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని సూచించారు.తొలుత ఆయన కన్నెమడుగు సచివాలయం ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులతో పాటు సిబ్బంది పనితీరు పై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమీక్షలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో లు ప్రసాద్, మారుతీ కుమార్, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, పుష్ప కుమారి, బాలగంగాధర్, భూదేవి, మండలంలోని క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News