Friday, 31 July 2026 10:54:57 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్ పాయ్ నేటి భారతీయ యువతకు ఆదర్శం.

Date : 25 December 2025 06:20 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్ పాయ్ నేటి భారతీయ యువతకు ఆదర్శం... ప్రశంసించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్... దివంగత నేత భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ 101వ జయంతిని పురస్కరించుకొని మదనపల్లి పట్టణం స్థానిక కదిరి రోడ్డు అన్నమయ్య సర్కిల్ నందు నూతనంగా ఆవిష్కరించిన వాజ్పాయ్ విగ్రహానికి బిజెపి శ్రేణులు పూలమాల లేసి ఘనంగా నివాళులు అర్పించారు... ఆయన జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మదనపల్లి కార్యాలయంలో అటల్ స్మృతి సమ్మేళనం పేరుతో సమావేశాన్ని నిర్వహించారు.... ఈ సమావేశంలో వాజ్పేయి వ్యక్తిత్వము వివిధ రంగాలలో ఆయన సాధించిన విజయాలు అనేక అంశాలపై పలువురు వక్తలు ప్రసంగించారు, వీటిలో ముఖ్యంగా పోక్రాన్ అణు పరీక్షలు పరీక్షలు, కార్గిల్ సమయంలో వారి యొక్క దృఢ నాయకత్వం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారుల నిర్మాణం వంటి ముఖ్యమైన కార్యక్రమాలు వాజ్పాయ్ పరిపాలన దక్షతకు ఉదాహరణలుగా నిలుస్తాయని తెలిపారు... వాజ్పేయి అందించిన పాలన వారసత్వానికి గౌరవించడానికి, దేశ పౌరులకు స్ఫూర్తి అందించడానికి, అనేక అద్భుత విజయాలు సాధించారని కొని యాడారు, ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల కృష్ణమూర్తి , డాక్టర్ అజమతుల్లా ఖాన్, బర్నేపల్లి రవికుమార్, నారద రెడ్డి, చంబకూరు కృష్ణమూర్తి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పిల్ల స్వామి నాయక్, బొజ్జప్ప , మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి , కిరణ్ కుమార్ , సునీల్ రెడ్డి , పూల నాగరాజు , ఆనంద్ తదితరులు పాల్గొన్నారు....

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :