నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 25 : తంబళ్లపల్లె మండలం పరసతోపు పంచాయతీ సచివాలయం సమాచార హక్కు బోర్డులో గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల పేర్లు దర్శనమిస్తున్నాయి. సచివాలయానికి వచ్చే ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని ఉటంకించే సమాచార బోర్డు లో పేర్లు మార్చకపోవడం పై అధికారుల నిర్లక్ష్యమా! లేదా గత ప్రభుత్వం మీద ఉన్న ప్రేమా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మండలంలో పలుచోట్ల ఇలాంటి పాత పేర్లతోనే కార్యాలయాలు, సచివాలయ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాల్సి ఉంది
Reporter
Namitha News