Friday, 31 July 2026 01:51:29 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పిచ్చలవాండ్లపల్లి చెరువు సప్లై ఛానల్ పూడికతీతకు ఎమ్మెల్యే షాజహాన్ శ్రీకారం

ఎమ్మెల్యే షాజహాన్ బాష భూమి పూజ

Date : 29 May 2026 07:03 PM Views : 78

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పిచ్చలవాండ్లపల్లి చెరువు సప్లై ఛానల్ పూడికతీతకు శ్రీకారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ మదనపల్లె గ్రామీణ మండలం పొన్నూటపాలెం పంచాయతీ పరిధిలోని పిచ్చలవాండ్లపల్లి చెరువు సప్లై ఛానల్ పూడికతీత పనులకు జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ నిర్వహించారు. ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో తాజ్మస్రూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జేసీబీ ద్వారా మట్టి తొలగింపు పనులను ఎమ్మెల్యే ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో జలధార–జలహారతి కార్యక్రమం ద్వారా చెరువులు, సప్లై ఛానళ్ల పూడికతీత పనులను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సప్లై ఛానల్ పూడికతీత పనులకు స్వచ్ఛందంగా జేసీబీ అందించిన వేణు, దిలీప్, మంజునాథ్‌లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల మేర చేపడుతున్న పూడికతీత పనులకు సహకరిస్తున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవి నాయుడు, ఈశ్వర్ నాయుడు, చిప్పిలి గురునాథ యాదవ్, నవాజ్, సోమశేఖర్ నాయుడు, జె.వి.రమణ, రాయచోటి శశికుమార్, రెడ్డి రాయల్, చల్లా, శ్రీనివాసులు నాయక్, ఇక్బాల్, డిప్యూటీ ఎంపీడీవో తిరుపాల్ నాయక్, సచివాలయ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :