నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె *నీటి తొట్టి లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి* మదనపల్లి మండలంలో విషాదకర ఘటన జరిగింది. తాలూక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా సోమలకు చెందిన జ్యోతిప్రకాష్ గత రెండేళ్లుగా మదనపల్లె మండలం, వలసపల్లి వద్ద ఓ మామిడి తోటకు కాపలాగా ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న విక్రాంత్ 4, సమీపంలో ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. బంగారం లాంటి మగ బిడ్డ నీటి తొట్టిలో పడి చని పోవడంతో, ఆ కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Reporter
Namitha News