Monday, 03 August 2026 06:10:41 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

అంగన్వాడి సమస్యల పరిష్కారానికి ఎంతవరకైనా సిద్ధం - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి హామీ

Date : 23 April 2026 11:20 PM Views : 448

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 23 : చాలీచాలని జీతాలతో జీవిస్తున్న అంగన్వాడి మహిళామతల్లుల సమస్యల పరిష్కారానికి అండగా నిలబడతానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అంగన్వాడీ మహిళలకు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం అంగన్వాడి కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి స్వగృహం చేరుకుని తమ సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు తమకు కనీస వేతనం రూ 26 వేలు చెల్లించాలని, మే నెల వేసవి సెలవులు ప్రకటించాలని, హెల్పర్ల ప్రమోషన్ జీవో నెంబర్ 5 సవరించాలని, పెండింగ్ లోని మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్పు చేయాలని డిమాండ్లను ఎమ్మెల్యేకు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతా శిశు సంక్షేమంతో పాటు చిన్నారుల పాలిట తల్లులుగా ఆలనా పాలనా చూస్తున్న అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం సోచనీమన్నారు. అంగన్వాడీలకు పనిభారం పెంచి రకరకాల యాప్ ల ద్వారా వెట్టి చాకిరి చేయించుకుని వారి పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. పాఠశాలలతో పాటు అంగన్వాడీలకు సైతం వేసవి సెలవులు ఇవ్వాలని, 20 26 మార్చి బడ్జెట్ లో అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నేటి నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు జీతాలు పెంచి వారి పని భారం తగ్గించి వారి సమస్యలు పరిష్కరించాలని లేదంటే కూటమి ప్రభుత్వానికి అంగన్వాడి మహిళల శాపం తగిలి తీరుతుందని హెచ్చరించారు. మీ సమస్యల పరిష్కారానికి ఓ సోదరుడుగా అండగా నిలబడి పోరాటంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. అంగన్వాడీలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, పరుసతోపు సర్పంచ్ శ్రీనివాసులు, నరేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి, ఎంపీటీసీలు మహేష్, కరిముల్లా నాయకులు, వందలాది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: