నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయ్యాయో లేదో బీజేపీ అసలు రంగు బయట పెట్టిందని మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డీ సాహెబ్ పేర్కొన్నారు పెట్రోల్ రూ.3.14, డీజిల్ రూ.3.11 రూపాయల పెంచి తన దాహన్నీ తీర్చుకుందని, ఇంతటితో ఆగేటట్లు లేరని ఇది బీజేపీ చేతగాని పాలనకు, దివాళా కోరుతనానికి నిదర్శనం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు,తప్పిదాలు సామాన్య, మద్యతరగతి ప్రజలపై భారం మోపే విధంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. ఇటీవల తెలంగాణ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 పొదుపు సూత్రాలు సూచించడాన్ని తనకు తప్ప మిగిలిన వారికేనా అంటూ ఎద్దేవా చేశారు. భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ ప్రధాని ఇలాంటి సూచనలు చేయలేదని ఆf అవసరం కూడా వారికి రాలేదని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన తీరు దేశ ఆర్థిక వ్యవస్థ పై పడిందని, దాని నుంచి బయటపడడానికి దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలకు ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారని ఇది భారత ప్రధానమంత్రికి బాధ్యతారాహిత్యం అని ఇది ఇలాగే కొనసాగితే రాబోవు రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని పేద మధ్యతరగతి వర్గాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని సూచించిన వెంటనే రూ.3 రూపాయలు మేర పెంచడాన్ని తప్ప పట్టారు. పెట్రోలు, డీజిల్ వాహనాలకు బదులుగా విద్యుత్ వాహనాలు, విద్యుత్ వినియోగం పైన సూచనలు చేయడం కేవలం ఆదానికి దోచిపెట్టడానికే అని ఆరోపించారు. వంటనూనెలు పరిమితంగా వాడాలని చెప్పడం వారి చేతగాని పతనానికి నిదర్శనం అన్నారు. ప్రజలు ఏమీ తిని బ్రతకాలని నిలదీశారు. మరోవైపు ఏడాది పాటు బంగారు కొనుగోలు వద్దని చెప్పడం, విడ్డూరంగా ఉందని, ఆ రంగాలలో పనిచేసే వ్యాపారస్తులు కార్మికులు ఎలా జీవించాలని... పేద, మధ్య తరగతి ప్రజలు ఇండ్లలో పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. వారి ఇండ్లలో శుభాకార్యాలు జరగడం కూడా ఇష్టం లేని విధంగా దిగుమతి సుంకం పెంచి బంగారు, వెండి ధర పెరుగుదల కారణం అయ్యారని విమర్శించారు. విదేశీ పర్యటనలు మానుకొని స్వదేశంలో మాత్రమే ప్రజలు తిరగాలని సూచించిన ప్రధానమంత్రి మీరు మరుసటి రోజే 5 దేశాల పర్యాటనలకు వెళ్ళడం ఆదర్శప్రాయం అన్నారు. ఇంకా వర్క్ ఫ్రం హోమ్, జీవనశైలి మార్చుకోవాలని సూచించడం ప్రజలకేనా, మీకు లేదా అన్నారు. రసాయన ఎరువులు వాడకం వద్దు, సేంద్రీయ ఎరువులు వాడాలని చెప్పే మీరు ఆదిశగా చేసిన చర్యలు ఏమిటని ప్రశ్నించారు. సామన్య ప్రజలపై పెట్రోలు డీజిల్ భారం అధికంగా వుంటుందని, దానిని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వలన పలు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టాడానికే తప్ప సామాన్య ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని అన్నారు. దేశ ప్రజలందరికీ అర్థమవుతుందని, ప్రజల గమనిస్తున్నారని రాబోవు రోజుల్లో మీకు సరైన సమాధానం చెబుతారని అన్నారు
Reporter
Namitha News