Tuesday, 09 June 2026 09:38:06 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు - డిస్ట్రిక్ట్ అడిషనల్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాధిక

Date : 02 April 2026 05:18 PM Views : 116

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 02: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ అడిషనల్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా. ఎల్. రాధిక హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ల్యాబ్ టెక్నీషియన్లు, ఐసీటీసీ (ICTC) కౌన్సిలర్లు, వైద్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు

ఈ సమావేశంలో డాక్టర్ రాధిక మాట్లాదుతూ మిషన్ ఎయిడ్స్ సురక్ష (MAS) కార్యక్రమం భాగంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించిన కార్యక్రమాలను ప్రతి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె సూచించారు. ప్రజలకు అవసరమైన పరీక్షలు, కౌన్సెలింగ్, చికిత్స సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా ఆరోగ్య కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రత్యేకంగా హెచ్ఐవి పరీక్షలు, కౌన్సెలింగ్ సేవలు మరియు అవసరమైన మందుల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. హెచ్ఐవి నిర్ధారణ అయిన వ్యక్తులకు సమయానికి చికిత్స అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్భాస్కర్ (వెంపల్లె) మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వారికి అవసరమైన హెచ్ఐవి పరీక్షలు మరియు వైద్య సేవలు సమయానికి అందేలా చూడాలని సూచించారు.జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్య రంగం సమన్వయంతో పని చేస్తే ఎయిడ్స్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలోని సబ్ సెంటర్లు మరియు ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవి స్క్రీనింగ్ లక్ష్యాలను కనీసం 95 శాతం వరకు సాధించేందుకు కృషి చేయాలని, అలాగే హెచ్ఐవి నిర్ధారణ అయిన వారిలో 95 శాతం మందికి నిరంతర చికిత్స అందించాలన్నారు.అలాగే వైరల్ లోడ్ నియంత్రణలో 99 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్ఐవి బాధితులకు అవసరమైన వైద్య సేవలు, కౌన్సెలింగ్ మరియు చికిత్స సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీ భాస్కర్, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఐసీటీసీ కౌన్సిలర్లు, టి.ఐ. ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :