నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 09 : బిజెపి సంస్థగత ఎన్నికల్లో భాగంగా అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షులుగా నియమితులైన మదనపల్లి పట్టణం వాసి పులి నరేంద్ర కుమార్ రెడ్డి ని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు. నరేంద్ర మరిన్ని పదవులు పొంది వృద్ధి లోకి రావాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, జనసేన నేత గంగారపు రాందాస్ చౌదరి, టీడీపీ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గ్రానైట్ బాబు, గడ్డం లక్ష్మీపతి, బీజేపీ నాయకులు బండి ఆనంద్, భగవాన్, మఠం కిరణ్, పిల్ల స్వామి నాయక్, శ్రీకాంత్, బలిజ సంఘం ప్రసాద్,జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News