నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 : మురికి నీటి కాలువ నిర్మాణానికి అడ్డు తగులుతున్నారని శుక్రవారం శ్రీనివాస కాలనీకి చెందిన ప్రజలు ఎంపీడీవో ఉషారాణికి ఫిర్యాదు చేశారు. శ్రీనివాస కాలనీకి చెందిన ప్రజలు ఈమధ్య విజన్ 2047లో కాలనీ మొత్తం సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించారని ఒకచోట కాలవ నిర్మాణానికి అరటి మొక్కలు అడ్డుగా ఉన్నాయని అవి తొలగించాలని యజమానికి చెప్తే ఆయన ససేమిరా అనడంతో ఎంపీడీవో ఉషారాణి కి ఫిర్యాదు చేశారు. ఆమె వెంటనే స్పందించి ప్రభుత్వ అభివృద్ధి పనులకు సహకరించాలని అడ్డుకో రాదని వెంటనే సమస్యను క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో విచారణ చేసి పరిష్కరించాలని డిప్యూటీ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ ను ఆదేశించారు
Reporter
Namitha News