Thursday, 30 July 2026 08:13:41 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తన భూమిని కాజేయాలని దాయాదుల కుట్ర - తన భర్త,కుమారుడిని కోల్పోయానని బాధితురాలి ఆవేదన - అధికారులు చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదని వెల్లడి - మద్దతు తెలిపి

Date : 23 November 2025 11:43 AM Views : 151

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తన భూమిని కాజేయాలని దాయాదుల కుట్ర - తన భర్త,కుమారుడిని కోల్పోయానని బాధితురాలి ఆవేదన - అధికారులు చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదని వెల్లడి - మద్దతు తెలిపిన జనసేన నాయకులు రాయల్ గణి,చక్రి మదనపల్లె : తన భూమిని కాజేయాలని దాయాదులు కుట్రలు పన్నుతున్నారని ములకలచెరువు మండలం,దేవుళచెరువుకు చెందిన రెడ్డెం లక్ష్మిదేవి ఆరోపించారు.శనివారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడును విన్నవించుకుంది.ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ తన భర్త రెడ్డెం రామిరెడ్డికి పూర్వీకుల నుండి సంక్రమించిన సర్వే నెంబర్ - 225లోని 1.21 ఎకరాలు భూమిపై దాయాదుల కన్నుపడిందని,ఇదే క్రమంలో తన భర్త రామిరెడ్డి,కుమారుడు మోహన్ రెడ్డిలను కోల్పోవడం జరిగిందని రోధించింది.అయితే తన భూమిని కాపాడుకోవడం కోసం అధికారులు,పోలీసులు చుట్టూ తిరిగిన న్యాయం జరగలేదని ఆరోపించారు.బాధితురాలికి ఉమ్మడి చిత్తూరు జిల్లాల జనసేన పార్టీ నాయకులు రాయల్ గణి నిలిచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో భూకబ్జాలు మితిమీరి పోయాయన్నారు.ఖాళీ స్థలం కనపదినా,ఖాళీ భూమి కనబడిన కబ్జా చేయడమే కబ్జాదారుల పని అన్నారు.రెడ్డెం లక్ష్మీదేవి తన సొంత భూమికి సంబంధించిన పత్రాలు కోసం కాళ్లరిగేలా తిరిగిన న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు.అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎన్ఎంవై 202511191025 ద్వారా అర్జీ సమర్పించింది.ఆమె సమస్యపై ములకలచెరువు సిఐని విచారణ జరపాలని ఆదేశించినప్పటికీ,ఎటువంటి స్పందన లేదన్నారు.సంవత్సరం క్రితం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైల్స్ దగ్ధమయ్యాయని,అందులో ఎంతోమంది పేదవారికి చెందిన భూముల పత్రాలు కాలిపోయాయన్నారు.దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజనుగా మదనపల్లి పేరు ప్రఖ్యాతి గడించిందని,అదే తరహాలో ఈ ప్రాంతంలో కబ్జాలు సైతం పెరిగిపోయాయన్నారు.పేదల భూములను,ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.ఒకరిద్దరిని అలా శిక్షిస్తే కబ్జాలకు చేసే వారికి భయం పుట్టుకొస్తుందన్నారు.ఇప్పటికైనా ఎవరూ లేని రెడ్డెం లక్ష్మీదేవి పరిస్థితిని అర్థం చేసుకుని కలెక్టర్,సబ్ కలెక్టర్,రెవెన్యూ అధికారులు,పోలీసు అధికారులు ఆమె భూమికి సంబంధించిన రికార్డులు అందజేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.బాధితురాలికి న్యాయం జరిగే వరకు జనసేన తరఫున పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చక్రి పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :